సరీసృపాల్లో పూర్తిగా చర్మం వదిలేసే ప్రత్యేకత పాములకు మాత్రమే ఉంది. ఈ ప్రక్రియను ఎక్స్‌డైసిస్ అంటారు. ఇతర జీవులకు చర్మం నిరంతరంగా మారుతుంటే, పాములకు మాత్రం పాత చర్మం కింద కొత్తది ఏర్పడుతుంది. అందువల్ల పాత చర్మాన్ని తీయడం అవసరం అవుతుంది. రాళ్లు, కొమ్మలు వంటి వస్తువులకు శరీరాన్ని రాపిడి చేసి పాములు కుబుసాన్ని విడుస్తాయి.