శుభకార్యాలలో తలపై అక్షింతలు వేస్తారు. అయితే అక్షింతలను తల మీద ఎందుకు వేస్తారో చాలా మందికి తెలిసి ఉండదు. అక్షింతలను స్వచ్ఛమైన బియ్యం, పసుపు కలిపి తయారుచేస్తారు. వీటిని పవిత్రంగా భావిస్తారు. ఎవరైనా మనస్ఫూర్తిగా, స్వచ్ఛమైన హృదయంతో ఆశీర్వదించినప్పుడు సానుకూల శక్తి మనకు చేరుతుందని నమ్మకం. ఆ శక్తి మన శరీరంలోకి, ముఖ్యంగా మన మెదడుకు చేరుకుంటుందని నమ్ముతారు. శుభకార్యాలలో అక్షింతలు వేయడమనేది ఐక్యత, ప్రేమను చాటుతాయి.