పాలకు స్థిరంగా గిరాకీ పెరుగుతూనే ఉంది. ఈక్రమంలో చాలామంది రైతులు పాడి పరిశ్రమపై ఆసక్తి చూపుతున్నారు. అయితే డెయిరీ ఫాం ప్రారంభించాలనుకునే రైతులు పూర్తిగా గేదెలు, ఆవుల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ పాలనిచ్చే మెహసానా జాతీ గేదెలు అనువైనవి. ఇవి 32 నెలల వయసుకే ఎదకు వచ్చి, 41-42 నెలల వయసులో ఈతకు వస్తాయి. దాదాపు 16 లీటర్ల పాలనిస్తాయి. అలాగే జఫరాబాద్, బధ్వారి జాతి గేదెలు సైతం ఫాంకి అనువైనవి.