TG: గర్భిణికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి సూదిని కడుపులోనే మర్చిపోయారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి జమ్మికుంటకు చెందిన ఓ గర్భిణి ప్రసవం కోస వచ్చింది. ఆమెకు వైద్యులు సిజేరియన్ చేయగా తల్లిబిడ్డా క్షేమంగానే ఉన్నారు. అయితే, కుట్లు వేసే సూది మహిళ కడుపులోనే వదిలేశారు. ఆ తర్వాత అనుమానం వచ్చిన వైద్యులు మహిళకు వెంటనే ఎక్స్‌రే తీయగా కడుపులో సూది ఉండటంతో బయటకు తీశారు.