యువకుడి కంటి పైభాగంలో దిగిన స్క్రూడ్రైవర్‌.. తొలగించిన వైద్యులు

82చూసినవారు
యువకుడి కంటి పైభాగంలో దిగిన స్క్రూడ్రైవర్‌.. తొలగించిన వైద్యులు
TG: ఓ యువకుడి కంటిపై భాగంలో ప్రమాదవశాత్తు స్క్రూడ్రైవర్‌ దిగింది. మెదక్‌(D) మనోహరాబాద్‌(M) కూచారానికి చెందిన రంజిత్‌(21) ప్రైవేటుగా విద్యుత్తు పనులు చేస్తుంటాడు. ఈ నెల 8న పనులు చేస్తుండగా స్క్రూడ్రైవర్‌ కుడి కంటి పైభాగంలో దిగింది. గాంధీ ఆసుపత్రి న్యూరోసర్జరీ వైద్యులు రెండు గంటలపాటు శ్రమించి సర్జరీ చేసి దాన్ని తొలగించారు. యువకుడు కోలుకుంటున్నాడని, త్వరలోనే డిశ్ఛార్జి చేస్తామని సూపరింటెండెంట్‌ తెలిపారు.

సంబంధిత పోస్ట్