నార్మల్‌గా మనం మనిషి కిడ్నీని మరొకరికి అమర్చడం చూసి ఉంటాం. ఎక్కడో మనిషికి జంతువు కిడ్నీ అమర్చారట.. కానీ బతకలేదట అని చెప్పుకుంటే విన్నాం. కానీ అమెరికాలోని అలబామాలో టోవానా లూనీ అనే మహిళకు పంది కిడ్నీ అమర్చగా.. 130 రోజులు బతికి మెడికల్ రంగంలో కొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది నవంబర్ 25న లూనీకి వైద్యులు పంది కిడ్నీ అమర్చగా.. ఇటీవల సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో డాక్టర్స్ దాన్ని తొలగించారు.