నిద్రలేవగానే చాలామంది టీ తాగనిదే పనులు మొదలుపెట్టారు. అయితే టీ తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలామంది భయపడుతుంటారు. కానీ అలాంటిది ఏం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాలు సమోసా, బిస్కెట్స్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. రోజుకు ఒకసారి టీ తాగడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు. అలాగే తక్కువ మోతాదులో చక్కెర వినియోగించాలని సూచిస్తున్నారు.