ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు సిగ్నల్‌ వ్యవస్థే లేదా?

54చూసినవారు
ఇరాన్‌ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు సిగ్నల్‌ వ్యవస్థే లేదా?
ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌కు సిగ్నల్‌ వ్యవస్థ ప్రధాన లోపంగా ఉన్నట్లు తుర్కియే రవాణశాఖ మంత్రి అబ్దుల్‌ ఖదీర్‌ వ్యాఖ్యానించారు. ‘ఆ లోహ విహంగంలో సిగ్నల్‌ వ్యవస్థ ఆన్‌ కాలేదు.. అసలు అటువంటి వ్యవస్థే దానిలో లేకపోయుండాలి’ అని తెలిపారు. విమానం ఆచూకీ కనుగొనడంలో సిగ్నల్ వ్యవస్థ కీలకమని తెలిపారు. కానీ ఎటువంటి సిగ్నల్స్ రాకపోవడంతో డ్రోన్ సహాయంతో హెలికాప్టర్‌ను గుర్తించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్