బాలుడిపై కుక్క దాడి (VIDEO)

54చూసినవారు
వీధి కుక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులపై అవి దాడులు చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇక గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో ఉన్న ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. బాలుడిని కింద పడేసి విచక్షణారహితంగా కరిచింది. బాలుడి తండ్రి రావడంతో ఆ కుక్క పారిపోయింది. బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్