రాష్ట్ర ప్రభుత్వాలు కుక్క, పాముకాటుల నుంచి ప్రజలను రక్షించడానికి ఔషధాలు అందుబాటులో ఉంచాలి. అంతేగాకుండా కోతులు, పాములు, కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. కుక్కల నియంత్రణకు శస్త్ర చికిత్స చేస్తూ పెంపుడు కుక్కలను, వీధి కుక్కలను సంబంధిత వైద్యశాఖలను అప్రమత్తపరిచి వాటి ఆరోగ్యాన్ని రక్షించాలి. ప్రజలను వాటి బారిన పడకుండా చూడాలి. అప్పుడే 'కుక్కకు- మనిషికి మధ్య విశ్వాసం' పెరుగుతుంది.