నోట కరిచి.. ఈడ్చుకెళ్లి.. నాలుగేళ్ల బాలికపై కుక్కల దాడి (వీడియో)

65చూసినవారు
TG: రెండు వీధి కుక్కలు ఓ చిన్నారిపై దాడి చేశాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేంద్రనగర్‌ సర్కిల్లోని గోల్డెన్‌హైట్స్‌కాలనీలో శుక్రవారం హాసిని(4) తన ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్తుండగా రెండు వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి వాటి నుంచి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అందులో ఓ కుక్క బాలిక కాలును నోట కరచుకొని కొద్దిదూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. తల్లి గమనించి పరుగెత్తుకు రావడంతో ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్