తమిళనాడులోని ఎడప్పాడిలో బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఇటీవల వీధి కుక్కల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో ఓ బాలుడిని వెంటపడి కొన్ని వీధి కుక్కలు కొరికాయి. బాలుడు వాటి నుంచి తప్పించుకునే క్రమంలో కింద పడ్డాడు. అయినప్పటికీ బాలుడి మీద పడి అవి కొరికి గాయపరిచాయి. బాలుడు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.