యూపీలోని లలిత్‌పూర్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. మెడికల్ కాలేజీ బయట ఒక చెత్త కుండీ వద్ద ఒక పసికందుని కుక్కలు పీక్కుతింటుండగా.. స్థానికులు గమనించి ఆస్పత్రి వర్గాలకు సమాచారం అందించారు. ఆస్పత్రి సిబ్బంది కుక్కులను తరిమేసే సమయానికి ఆ పసికందు తలను కుక్కలు తినేశాయి. దీంతో నవజాత శిశువు తల్లిదండ్రులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పోలీసులకు ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.