భోజనం చేశాక కొన్ని పనులను అసలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం తిన్న వెంటనే కాఫీలు, టీలు తాగకూడదు. ఒకవేళ తాగితే జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల అజీర్ణం, గుండెలో మంట, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది.