భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు

63చూసినవారు
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు
ఇజ్రాయెల్– ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్‌ 920 పాయింట్లు పడిపోయి 80,782 వద్ద, నిఫ్టీ 279 పాయింట్ల నష్టంతో 24,608 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.15గా ఉంది. ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్