యూపీలోని కుందా ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్(రాజా భయ్యా)పై గృహహింస కింద కేసు నమోదైంది. ఆయన భార్య భన్వి సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. రాజాభయ్యా, అత్తమామలు చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బన్వి సింగ్ గతంలోనూ ఇవే ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్, ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీని ఆశ్రయించారు.