మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాయలో పడి మోసపోవద్దని ప్రజలకు తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. 'ఇంట్లో ఉంటూనే సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మొద్దు. ప్రొడక్ట్స్ కొంటే లాభాలు వస్తాయని, మీతో పాటు నలుగురిని చేర్చుకోవాలంటూ బ్రెయిన్ వాష్ చేసే వారితో జాగ్రత్త. ముఖ్యంగా గృహిణులు అప్రమత్తంగా ఉండాలి. పేరు ఏదైనా అక్కడ జరిగేది పచ్చి మోసం. మీతోపాటు మరికొందరిని బలి చేయొద్దు' అని హెచ్చరించారు.