భారత్ దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ దుందుడుకు చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు జరిపినట్లు భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉద్ధంపుర్‌లోని మిలిటరీ స్టేషన్‌లను లక్ష్యంగా చేసుకుని దాయాది దేశం డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినట్లు ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. అయితే, వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్టు పేర్కొంది.