పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కొత్త రిలీజ్ డేట్‌పై నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ స్పందించారు. ఈ ప్రచారాలను నమ్మొద్దని, కొన్ని రోజుల్లో తామే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తామని దర్శక, నిర్మాతలు తెలిపారు.