TG: పార్టీలో అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. కొత్తపాత తేడా వద్దని.. త్వరలో అన్ని కమిటీల నియామకం పూర్తిచేయాలన్నారు.పీఏసీ సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ పార్టీకి సంబంధించిన అంశాలపై బయట ఎలాంటి విమర్శలు చేయొద్దని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దని సూచించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సమన్వయం చేయాలని దిశానిర్దేశం చేశారు.