ఒక్కప్పుడు కేవలం వర్షాకాలం సీజన్‌లో మాత్రమే పుట్టగొడుగులు లభించేవి. వర్షం పడినప్పుడు ఇవి మొలకెత్తేవి. చెరువులు, పొలాలు, అడవుల్లో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఏడాది పొడవునా మనకు పుట్టగొడుగులు అందుబాటులో ఉంటున్నాయి. అయితే జూన్ నుంచి పుట్టగొడుగులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని, సీజనల్ వ్యాధుల నుంచి ఇవి కాపాడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ సీజన్‌లో వీటిని ఎక్కువగా తినడం మంచిదని సూచిస్తున్నారు.