అపజయానికి ఎన్నో కారణాలుంటాయి. పరీక్షల సమయానికి విద్యార్థి ఆరోగ్యం సరిగాలేకపోవచ్చు. లేదా కుటుంబసభ్యుల అనారోగ్యం, ఆకస్మిక మరణం వారిని లక్ష్యం నుంచి వెనక్కు నెట్టొచ్చు. ఫెయిలైన తర్వాత కుటుంబసభ్యులు కోప్పడతారనో.. స్నేహితులు, బంధువులు ఎగతాళి చేస్తారనో.. చాలామంది విద్యార్థులు భయపడుతుంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేమనే భయంతో ప్రతికూల ఆలోచనలు చేస్తుంటారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారు.