హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించిన వార్తల్లో మేఘాలయ పేరును ప్రస్తావించొద్దని ఆ రాష్ట్ర సీఎం కన్రాడ్ సంగ్మా అన్నారు. 'ఈ ఘటనను రాష్ట్రం, కమ్యూనిటీ, మా ప్రాంతం మొత్తానికి ఆపాదిస్తున్నారు. నార్త్ ఈస్ట్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. దయచేసి భవిష్యత్‌లో ఏ రాష్ట్రానికి ఈ పరిస్థితి తీసుకురావొద్దు' అని ఆయన మీడియాను కోరారు.