ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దు.. ఇది నా రిక్వెస్ట్: మంచు విష్ణు

61చూసినవారు
‘మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది’ అని నటుడు మంచు విష్ణు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మేము మళ్లీ తిరిగి కలుస్తామని ఆశిస్తున్నా. ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. కాబట్టి, ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్. నిన్న జరిగిన ఘర్షణలో ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. అది బాధాకరం. ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధపెట్టాలనుకోలేదు’’ అని విష్ణు తెలిపారు.

సంబంధిత పోస్ట్