AP: మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని మంత్రి సీతక్క సూచించారు. మానవత్వంతో కూడిన మతాన్ని ప్రజలు ఇష్టపడతారని తెలిపారు. మతానికి మానవత్వం జోడిస్తేనే లోక కల్యాణం అవుతుందని, మతాలు వేరైనా, దేవుళ్లు వేరైనా ఎవరి విశ్వాసాలు వారివని అన్నారు. దహించు అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న బిషప్ డా.థామస్ కు అమెరికా యూనివర్శిటీ అందించిన సీప్ అంబాసిడర్ అవార్డును సీతక్క బహూకరించారు.