ఇరాన్ తమ దేశంపై దాడి చేయాలని ప్రయత్నిస్తే గతంలో ఎన్నడూ లేని నష్టం జరుగుతుందని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికా బలగాలు పూర్తి స్థాయిలో ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ దాడులకు అమెరికాకు సంబంధం లేదన్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధానికి శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు.