తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు ఆదుకునేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ ముందుకొచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.25లక్షలు, నిర్మాతల మండలి తరఫున రూ.10లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ ఇచ్చే సమాచారం మేరకు సహాయ కార్యక్రమాలు చేస్తామని వెల్లడించింది. అన్ని థియేటర్ల వద్ద విరాళాలు, వస్తువుల సేకరణ సెంటర్లు ఏర్పాటు చేస్తామంది.