తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ.. రేపటి నుంచి సర్వే చేపట్టనుంది. రేపటి నుంచి అధికారులు అర్హులై ఉండి మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలను సేకరించనున్నారు. ఇందుకోసం రైతుభరోసా పంట రుణమాఫీ యాప్ రూపొందించారు. 2లక్షలు దాటి రుణం వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయశాఖ అనుమతించింది.