హైదరాబాద్ లోని BJP కార్యాలయంలో నిర్వహించిన ఢిల్లీ ఎన్నికల విజయోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ మాదిరిగా తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి అంటే ఏంటో ఢిల్లీలో చేసి చూపిస్తాం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ విజయం సాధిస్తాం' అని చెప్పారు.