AP: వరకట్న వేధింపులకు మరో మహిళ బలైంది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చోటు చేసుకుంది. లక్ష్మి ప్రియాంక అనే మహిళకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. లక్ష్మి ప్రియాంక కుటుంబం కోటి రూపాయలు కట్నం ఇచ్చారు. అయితే అత్తింటి వారు అదనపు కట్నం కోసం లక్ష్మి ప్రియాంకను తరుచూ వేధించేవారు. దాంతో ఆమె ఆత్మహత్యకు యత్నించింది. విజయవాడలో చికిత్స పొందుతూ లక్ష్మి ప్రియాంక మృతి చెందారు. దాంతో బాధితురాలి కుటుంబం ఆందోళనకు దిగారు.