రాజస్థాన్‌లో 498A కేసుతో భార్య వేధింపులకు గురై తన అత్తింటి ఎదుటే టీ స్టాల్ పెట్టిన కృష్ణ కుమార్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ‘498A T CAF’ అని పేరుపెట్టి న్యాయం వచ్చే వరకు టీ అందిస్తానంటూ చేతికి సంకెళ్లు వేసుకుని కస్టమర్లకు టీ అందిస్తున్నాడు. అదనపు కట్నం కోసం కృష్ణ కొట్టాడని, విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని భార్య మీనాక్షి ఆరోపిస్తోంది. ఈ ఘటన రాజస్థాన్‌లోని ‘అంటా’ సిటీలో చోటుచేసుకుంది.