తెలంగాణ ప్రజల అభిప్రాయానికి గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను అందుబాటులో ఉంచాలని CM రేవంత్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తుది ముసాయిదాను రూపొందించాలన్నారు. గిగ్ వర్కర్లు, యూనియన్ల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమై చర్చించారు. ముసాయిదాలో సీఎం పలు మార్పులు చేర్పులను సూచించారు.