వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లం టీ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే.. జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలుగుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపేందుకు సహాయపడతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే బెల్లం టీని వేడి వాతావరణంలో తీసుకోవద్దు. దీని వల్ల ఆరోగ్య సమస్యలొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.