చివరి నిమిషంలో ఆటో క్యాన్సిల్ చేసిందని యువతిపై చేయి చేసుకున్న డ్రైవర్ (వీడియో)

84చూసినవారు
కర్ణాటకలోని బెంగళూరులో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి ఆన్‌లైన్‌ ద్వారా ఆటో బుక్ చేసుకుంది. సదరు ఆటో డ్రైవర్ ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఆమె చివర నిమిషంలో రైడ్ క్యాన్సిల్ చేసి.. వేరే ఆటో ఎక్కింది. దీంతో లొకేషన్ చేరుకున్న ఆటో డ్రైవర్ యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరి నిమిషంలో రైడ్ ఎందుకు క్యాన్సిల్ చేశారు. గ్యాస్ ఖర్చులు ఎవరిస్తారని గట్టిగా కేకలు వేస్తూ యువతిపై చేయి చేసుకొని రెచ్చిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్