ఆఫ్రికా దేశమైన సూడాన్‌లోని ఎల్-ఫశేర్‌లో ఓ ఆసుపత్రిపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కాగా, 2023 ఏప్రిల్ నుంచి సూడాన్‌లో ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.