రష్యా-ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో యుద్ధం మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఉక్రెయిన్ ఊహించని దాడులతో రష్యా వాయుసేన స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో, రష్యా ప్రతీకారంగా 479 డ్రోన్లతో బదులిచ్చింది. ఈ దాడుల నేపథ్యంలో భద్రతా కారణాలతో మాస్కోలోని నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం రెండు గంటల్లో 76 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది.