యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. గోండాలోని దుర్గాగంజ్ గ్రామం నవాబ్‌గంజ్‌లో మద్యం మత్తులో ఉన్న యువకుడు విద్యుత్ స్తంభం ఎక్కి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. చాలాసేపటి తర్వాత ఆ యువకుడిని స్తంభం మీద నుండి కిందకు దించారు. అయితే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలాగే స్తంభం ఎక్కాడని స్థానికులు వాపోయారు.