బకాయిలు వెంటనే చెల్లించాలి.. సీఎంకు బండి సంజయ్‌ లేఖ

82చూసినవారు
బకాయిలు వెంటనే చెల్లించాలి.. సీఎంకు బండి సంజయ్‌ లేఖ
TG: ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రూ.8వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కళాశాలలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. ఇప్పటికే అనేక డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు మూతపడ్డాయని, కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్