దుర్గాభాయి దేశముఖ్ రాజకీయ నాయకురాలు. దుర్గాబాయి చిన్ననాటి నుంచే స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకుంది. తెలుగుగడ్డపై మహాత్మా గాంధీ రాకను పురస్కరించుకుని 12 ఏళ్ళ వయసులోనే ఈమె విరాళాలను సేకరించి ఆయనకు అందజేసింది. మహాత్ముని సూచన మేరకు ఏ మాత్రం ఆలోచించకుండా తన చేతులకు ఉన్న బంగారు గాజులను కూడా విరాళంగా అందజేసింది. ఈమె స్థాపించిన రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్త్రీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తున్నాయి.