సినీ నటుడు షైన్ టామ్ చాకో 2015లో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనలో మరో ఆరుగురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కేరళ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సులేఖ కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలను పరిశీలించి 7 మందిని నిర్దోషిగా తేల్చింది. అయితే అప్పట్లో చాకో బెయిల్‌పై వచ్చి సినిమాలు చేస్తున్నారు. కాగా చాకో తెలుగులో నాని నటించిన దసరా మూవీలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.