EAPCET.. ఒక్కో అభ్యంతరానికి రూ.500

56చూసినవారు
EAPCET.. ఒక్కో అభ్యంతరానికి రూ.500
TG: EAPCET కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్ష తర్వాత విడుదల చేసే కీలో అభ్యంతరాలు తెలియజేయాలంటే.. విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ.500 చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు. వారి అభ్యంతరం సరైనదని తేలితే ఆ మొత్తాన్ని తిరిగిస్తారు. హేతుబద్ధత లేకుండా వందల సంఖ్యలో అభ్యంతరాలు వస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యార్థులపై భారం పడనుంది. గతంలో ఫ్రీగానే అభ్యంతరాలు వ్యక్తపరిచే అవకాశం ఉండేది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్