తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేశాయి. ములుగు జిల్లా కేంద్రంగా ఇది సంభవించింది. భూప్రకంపనల కారణంగా ఉ.7.27 గంటలకు మేడారం సమ్మక్క, సారక్క ఆలయం ప్రకంపనలతో ఒక్కసారిగా ఊగిపోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న అర్చకుడు, ఓ భక్తురాలికి అసలేం జరుగుతుందో అర్థం కాక కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆలయ గోడలకు ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.