భూకంపంతో ఆఫ్గానిస్థాన్ మరోసారి ఉలిక్కిపడింది. రిక్టార్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో అఫ్గానిస్థాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో కూడా ప్రకంపనలు సంభవించాయని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. కాగా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే ఆఫ్గానిస్థాన్‌లో భూ ప్రకంపనలు రికార్డు అయినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.