ఢిల్లీలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ సహా NCR, బిహార్, యూపీలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఢిల్లీలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీలో ఉదయం 5.36 గంటలకు ఓ ఇంటి టెర్రస్ పై ఉన్న సీసీ కెమెరాలో భూ ప్రకంపనల దృశ్యాలు రికార్డయ్యాయి. పలు సెకన్ల పాటు భూమి కంపిస్తూ ఉండగా, అన్నీ ఊగుతున్నట్లు అందులో కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.