రష్యాలోని నైరుతి సైబీరియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో ఈ ప్రకృతి విపత్తు సంభవించింది. భూకంపం కారణంగా సమీప ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. అల్టాయ్ రిపబ్లిక్‌లోని అక్తాష్ సమీపానికి ఆగ్నేయంగా దాదాపు 47 కిలోమీటర్ల దూరంలో అధికారులు భూకంప కేంద్రాన్ని గుర్తించారు.