టిబెట్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. మంగళవారం ఉదయం 7:35 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం (NCS) వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం ఎంత జరిగిందనే అక్కడి అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే నెల రోజుల క్రితం కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు వచ్చినట్లు NCS పేర్కొంది.