టర్కీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదు

78చూసినవారు
టర్కీలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదు
టర్కీలోని కోన్యా ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం యొక్క తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదైనట్లు టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ (AFAD) వెల్లడించింది. దీంతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్