మన శరీరానికి అవసరమైన మాంగనీస్ లభించాలంటే నట్స్, పచ్చటి ఆకుకూరలు, చేపలు, మిరియాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కాఫీ, టీలను పరిమితంగా తాగాలి. అవకాశం ఉంటే వారానికి 3-4 సార్లు పైనాపిల్ తింటే మాంగనీసు లోపం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్‌లో మాంగనీస్ బాగా లభిస్తుంది. అందుకే క్యారెట్‌ను తినడం లేదా జ్యూస్ తాగండి. షుగర్ పేషంట్లు మాత్రం వైద్యుల సలహా మేరకు వారు సూచించిన పదార్థాలు తినాలి.