కాకరకాయను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాకరకాయలో ఉండే ఫైబర్.. మలబద్ధకం, ఆమ్లత్వం, ఇతర కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా కాకరకాయను తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాకరకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి.. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ముఖ్యంగా కాకరకాయను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.