ఉదయాన్నే ఖర్జూరాలు తింటే రక్తపోటుకు చెక్: నిపుణులు

79చూసినవారు
ఉదయాన్నే ఖర్జూరాలు తింటే రక్తపోటుకు చెక్: నిపుణులు
ప్రతిరోజు ఉదయాన్నే ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూర పండ్లలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6 తో సహా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడానికి, గుండెకు సంబంధించిన వ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది. ఇంకా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్